Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతతో పోరాడతారు.. అలాగే వారి సతీమణులు కూడా అంతే బాధ్యతతో కుటుంబాలను చూసుకుంటూ, రక్షణగా నిలుస్తారు.. ఇలాంటి తరుణంలో భార్యలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ''భారత్ కీ నారీ''.
ఎం.డి.నజీర్ ఉద్దీన్ హీరోగా, సీతామహాలక్ష్మీ హీరోయిన్గా అఖిల్ గంధం సమర్పణలో డియస్ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యం డి. నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి యస్ రాథోడ్ దర్శకుడు. 75వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం మోషన్ పోస్టర్ని లాంచ్ చేయగా, మరో అతిథి కల్నల్ రామారావు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'మిలట్రీ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది, అవ్వాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'బోర్డర్లో సైనికులు ఏవిధంగా దేశాన్ని కాపాడడానికి బాధ్యత వహిస్తారో, అదే విధంగా తమ సతీమణులు ఒంటరిగా తమ కుటుంబాన్ని కూడా అంతే బాధ్యతగా చూసుకుంటారు. ప్రేమ, దేశ భక్తి వంటి కాన్సెప్ట్‌తో మిళితమైన ఈ చిత్రాన్ని దేశ సైనికులు, వారి సతీమణులకు, తల్లి తండ్రులకు అంకితం చేస్తున్నాం' అని దర్శకుడు డి.యస్.రాథోడ్ తెలిపారు.