Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు కరుణ కుమార్ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమా 'కళాపురం'. 'ఈ ఊరిలో అందరూ కళాకారులే' అనేది క్యాప్షన్. ఈనెల 26న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు.
మంగళవారం మీడియాతో నిర్మాత రజినీ తాళ్లూరి మాట్లాడుతూ, 'మా సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ కరుణ కుమార్‌గారు, జీ స్టూడియోస్ వారు, రాజేష్‌గారు, మణిశర్మగారు ఇలా అందరూ సపోర్ట్ చేయటంతో ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. ఈనెల 26న మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ మూవీని ఎంజారు చేస్తారు' అని అన్నారు. 'ఇప్పటి వరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశాను. ఈ సినిమా కామెడీ సినిమా అయినప్పటికీ ఎక్కడా బూతులు వాడలేదు. ఒకరినొకరు కొట్టుకోవటం లేదు. అశ్లీలత లేదు. సినిమాని చూసిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు' అని దర్శకుడు కరుణ కుమార్ చెప్పారు. జీ స్టూడియో నిమ్మకాలయ ప్రసాద్ మాట్లాడుతూ, 'సబ్ టైటిల్స్ ఉన్న సినిమాను చూసి ముంబై నుంచి వచ్చిన వాళ్లే ఎంజారు చేశారు. రేపు థియేటర్స్‌లో అందరినీ మెప్పిస్తుంది..అలాగే నవ్విస్తుంది కూడా' అని తెలిపారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ, 'వంద శాతం సినిమాను అందరూ ఎంజారు చేస్తారు. క్యూట్ కామెడీ. ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిత్రం శ్రీను చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్ర చేశాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్' అని చెప్పారు.