Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో అందరి దష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఆసక్తికర చిత్రం 'కమిట్ మెంట్'. రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభరు సింహా రెడ్డి నటీ నటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈనెల 19న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. ఒక మహిళగా సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఈ సినిమా తీశాను. ఈ సినిమా పోస్టర్స్, క్లిప్పింగ్స్ చూసి అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుందని అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుత సొసైటీలో మహిళలు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చూపించాం. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క మహిళకు కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.
'కోవిడ్ కారణంగా నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సినిమాను చెప్పగానే అంగీకరించి చేసిన నిర్మాతలు బలదేవ్, నీలిమ, అనిల్ గార్లకు థ్యాంక్స్. మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. లక్ష్మి కాంత్ చెన్న రాసుకున్న నాలుగు కథలు స్టోరీకి వీరంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ, చాలా చక్కగా తీశారు. ఇందులో ఉన్న నాలుగు కథలు సొసైటీలో జరిగేవే. ఈ సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా మా టీమ్‌ను మెచ్చుకుంటారు' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారాకేష్ అన్నారు.