Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన చిత్రం 'కార్తికేయ 2'. ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ'కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్స్‌లో విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే, అది రెండో రోజుకు 200 థియేటర్స్ పెరిగి, ఈ రోజు 700 థియేటర్స్‌లో ఆడుతోంది. సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాసై ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే, సినిమాలో సత్తా లేకపోతే ఇన్ని థియేటర్స్‌లో ఆడదు కదా.. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'ఇండియా వైజ్ అందరి ప్రేక్షకులకు రిచ్ అయిన సినిమా ఇది. ఆగష్టు నెల సినిమా ఇండిస్టీకి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిఖిల్, చందు నాతో సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతామే తప్ప, మాకు సినీ ఇండిస్టీలో ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా హెల్దీ ఎట్మాస్ఫియార్లో ఉంటాం' అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
చిత్ర నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ,'మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్,అనుపమ, టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది' అని చెప్పారు. 'మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని హీరో నిఖిల్ తెలిపారు. అతిథిగా వచ్చిన దర్శకుడు 'మా సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్. వారికి నా ధన్యవాదములు. టెక్నీకల్‌గా అందరూ ఫుల్ కో ఆపరేట్ చేశారు. షూటింగ్ మొదలు ఎండింగ్ వరకు నాతో ట్రావెల్ చేసిన మణిబాబు కర్ణం, కార్తీక్ ఘట్టమనేనికి థ్యాంక్స్. మా నిర్మాతల సహకారం మరువలేనిది' అని చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు.