Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'.
మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్‌గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఫ్యాను. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లు సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో గోల్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ గోల్‌ని రీచ్ అయ్యే క్రమంలో చాలా సర్ప్రైజులు ఉంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పేరుని వాడాం. అది కూడా అందర్నీ వినోదపరచటానికి.. ఆయన పేరుని ఏ మేరకు వాడాలో అంతే వాడాం (నవ్వుతూ)' అని తెలిపారు.