Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటిస్తున్న చిత్రం 'తీస్ మార్ ఖాన్'. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పాయల్ రాజ్‌పుత్ నాయిక. కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, 'ఇది పక్కా కమర్షియల్ చిత్రం. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేశాను. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కళ్యాణ్‌కు థ్యాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థ్యాంక్స్. సాయి కార్తిక్ సంగీతం, మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా అందరూ బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు' అని తెలిపారు.
'ఈ కథ నమ్మి అవకాశం ఇచ్చిన హీరో ఆది, నిర్మాత తిరుపతిరెడ్డిగారికి థ్యాంక్స్. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటిర్, కెమెరామెన్ ఇలా అందరూ అద్భుతం చేశారు. రాకేందు మౌళి, భాస్కర భట్ల మంచి పాటలు అందించారు. ఇందులో ఎప్పుడూ చూడని సునీల్‌ను చూస్తారు' అని డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ చెప్పారు.
నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, 'కళ్యాణ్ స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పాను. ఆ తరువాత ఆది దగ్గరకు వెళ్లి ఈ కథ గురించి చెప్పాను. ఆయనకీ కథ బాగా నచ్చింది. ఆది గారికి కెరీర్ బెస్ట్ సినిమా ఇస్తానని చెప్పాను. తొలి రోజు నుంచే మంచి స్నేహితుడిలా మారిపోయాడు. సాయి కార్తీక్ వల్లే ఈ సినిమాకు బీజం పడింది. 'పటాస్, రాజా ది గ్రేట్లా' ఉంటుందని అన్నాడు. సినిమాకు సంగీతంతో ప్రాణం పోశారు. 'తీస్ మార్ ఖాన్' అనేది మా టీమ్‌కు బెస్ట్ మూవీ అవుతుంది. ఈనెల 19న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని చూసి, ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న హీరోలు అడివిశేష్, సుధీర్‌బాబు, సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.