Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకులను, చిరు అభిమానులను 'గాడ్‌ఫాదర్' చిత్ర బృందం సర్ప్రైజ్ చేసింది. 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ పోస్టర్లో చిరంజీవి రఫ్ అండ్ స్టయిలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఆ పాత్రను పరిచయం చేయడానికి ఉద్దేశించిన గ్లింప్స్ కూడా అద్భుతమైన స్పందనను పొందింది. దీంతోపాటు ఇంకా అద్భుతమైన అప్డేట్ చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్. ఈనెల 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 21న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
గురువారం విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి సీరియస్‌గా బ్లాక్ షేడ్స్‌తో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సిటీలోని రాత్రి దశ్యాన్ని చూడవచ్చు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఈ తరహా లుక్‌లో కనిపించడం విశేషం.
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్, సత్యదేవ్ సైతం ముఖ్య పాత్రలో మెరవబోతున్నారు. ఈ సినిమాలో అటు ప్రేక్షకుల్ని, ఇటు మెగా అభిమానుల్ని మెస్మరైజ్ చేసే అంశాలు ఎన్నో ఉన్నాయని, అలాగే ఎన్నో ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే దీమాతో మేకర్స్ ఉన్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాకాడ అప్పారావు.