Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తొలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో చాలా పదునైన కత్తి (తమహాగానే)ని యాక్షన్ సన్నివేశాల్లో నాగ్ ఉపయోగించిన తీరు అకట్టుకుంది. 'ది ఘోస్ట్' మేకర్స్ అసలు ఆ కత్తి (తమహాగానే) ఎలా తయారు చేయబడిందో వెల్లడించడానికి ప్రోమోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
తొలిసారి ఇలాంటి సబ్జెక్ట్‌తో నాగార్జునని ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా చూపించనున్నారు. నాగ్ కోసం వచ్చే అండర్ వరల్డ్ గురించి ఎవరో హెచ్చరించడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. 'రానీ' అంటూ నాగార్జున నడుచుకుంటూ వచ్చి 'రెడ్ నోటీసు' అనే ఫైల్‌ను చూస్తాడు. అందులో అండర్ వరల్డ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలు స్పష్టంగా ఉన్నాయి. అప్పుడు, నాగార్జున ఒక భారీ పెట్టెను తెరిచాడు, అక్కడ తమహాగానే అనే ముడి ఉక్కును కనుగొంటాడు. ఎర్రగా కాల్చి దానితో పదునైన కత్తిని తయారు చేస్తాడు. 'కత్తి రాజు చేతిలో గర్వంగా ఉంది' అని ప్రోమోలోని కోట్ చూపుతుంది. నాగ్ ఆ కత్తితో కొట్టగానే ఓ వస్తువు రెండు ముక్కలుగా కట్ అవుతుంది. అది కత్తి పదునెంత ఉందో ఈ షాట్ చెప్పకనే చెబుతుంది. అండర్ వరల్డ్ స్థానానికి చేరుకుని నాగ్ కత్తితో విశ్వరూపం చూపిస్తాడు. తమహాగానే అనేది జపనీస్ సంప్రదాయంలో తయారు చేయబడిన ఒక రకమైన ఉక్కు. దీనితో వారు కత్తులు తయారుచేస్తుంటారు. తమా అంటే విలువైనదని, హాగానే అంటే ఉక్కు అని అర్థం. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు ప్రోమోలో మేకర్స్ తెలిపారు. ప్రోమోలో ఉపయోగించిన భరత్, సౌరబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. వచ్చే వారం విడుదల కానున్న ట్రైలర్లో మరిన్ని యాక్షన్లను చూడబోతున్నాం. భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయిక. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి., సంగీతం: మార్క్ కె రాబిన్ (పాటలు భరత్ మరియు సౌరబ్), యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మోహన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.