Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ,'మంచి కాన్సెప్ట్‌తో పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథ ఇది. అలాగే యూత్‌కు కావాల్సిన వినోదాన్ని కూడా మిక్స్ చేసి తెరకెక్కించాం. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు మా చిత్రాన్ని తీసుకొస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తాం. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది మ్యూజికల్ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు. 'ఇప్పటివరకు మేం రిలీజ్ చేసిన టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది' అని చిత్ర నిర్మాతలు తెలిపారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ, 'పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.