Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న కథానాయకుడు సత్యదేవ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'కష్ణమ్మ'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వి.గోపాల కష్ణ దర్శకత్వంలో కష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ 'ఏమౌతుందో మనలో..' అనే మెలోడి సాంగ్‌ను అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ప్రేమలో గాఢతను తెలియజేసేలా ఉన్న ఈ పాటలో మనసులోని భావాలను ప్రేమికులు బయటకు వ్యక్తం చేయలేనప్పుడు మనసులతో ఊసులాడుకుంటారనేలా హవ భావాలను చక్కటి పదాలను వ్యక్తం చేశారు. పాట మనసుకి హత్తుకుంటోంది. సన్ని కూరపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చి పెట్టాయి. రీసెంట్గా విడుదలైన 'కష్ణమ్మ' సినిమా టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ యాక్టింగ్లోని ఇన్టెన్సిటీ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే కష్ణమ్మ సినిమా. ఓ చిన్న ఘటన వారి ముగ్గురి జీవితాలను ఎలా వారి జీవితాల్లో ఎలాంటి మలుపు తిప్పిందనేదే సినిమా' అని చిత్ర బృందం తెలిపింది.