Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'ప్రేమ విమానం'. సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా ఈ నూతన చిత్రం ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్చాన్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయికగా నటిస్తున్నారు. కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం : సంతోష్ కట, నిర్మాత: అభిషేక్ నామా, సంగీతం: అనూప్ రూబెన్స్, డీవోపీ: జగదీష్ చీకటి, ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడికర్, ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల, కాస్ట్యూమ్ డిజైనర్: అమత బొమ్మి, సీఈవో: వాసు పోతిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రౌలియాని.