Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'సలార్'. ఫ్యాన్స్, ప్రేక్షకులు, యావత్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హౌంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ అవుతోంది.
ఎనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టాక్ ఆఫ్ ది ఇండిస్టీగా మారింది. ఇందులో ప్రభాస్ ఫస్ట్‌లుక్‌కి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను వెండితెరపై చూస్తామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇటీవల ప్రభాస్ పాత్రకు సంబంధించిన సరికొత్త లుక్‌ను విడుదల చేయటంతో పాటు రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎనౌన్స్ చేశారు.
''సలార్' అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్. ఇండియా సహా యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా యాబై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రభాస్ సినిమాపై ఫుల్ ఫోకస్‌గా ఉన్నారు. సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎంటైర్టైమ్ ఫుల్ ఎఫర్ట్‌తో వర్క్ చేస్తున్నారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. దీంతో మేకర్స్ ఫారిన్ స్టూడియోలో ఈ వర్క్ అంతటినీ పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు చేయనటువంటి మాస్ అండ్ రా క్యారెక్టర్‌తో మెప్పించబోతున్నారు. ఆయన సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ చిత్రంలో పథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రెడ్డి, శ్రియా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.