Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫన్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'కొత్త కొత్తగా'. హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాథ్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.జి.గోవిందరాజు సమర్పిస్తున్నాను. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
'న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా అన్ని హంగులతో ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి తెరకెక్కించారు. కథానుసారం రాజీపడకుండా నిర్మాత మురళీధర్ రెడ్డి నిర్మించారు. నాయకానాయికలు అజరు, వీర్తి వఘాని పాత్రలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈ పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము పోల్చుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ప్రేమకథ ఇది. ఓ మంచి కంటెంట్‌తో సెప్టెంబర్ 9న విడుదలతువున్న ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కెమెరా : వెంకట్, ఫైట్ మాస్టర్: పధ్వీ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని.