Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ బేబీ' సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్'కు అధికారిక రీమేక్‌గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 16న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
రిలీజ్ డేట్ పోస్టర్లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్‌గా ఉంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా ఉంది. 'మిడ్నైట్ రన్నర్స్' గ్లోబల్ అప్పీల్ ఉన్న కథ. ఈ కథలోని కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి పెట్టిన 'శాకిని డాకిని' టైటిల్‌కి మంచి స్పందన లభించింది. అలాగే నివేద, రెజీనా పాత్రలు ఇందులో ఎలా ఉండబోతున్నాయో పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. సౌత్ కొరియా యాక్షన్, కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్'ని మన నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు సుధీర్‌వర్మ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చే చిత్రమిది. ఈ కథేంటి?, ఇందులో రెజీనా, నివేద ఏం చేయబోతున్నారు?, వారి లక్ష్యం ఏంటి? అనే ప్రశ్నలకు కచ్చితంగా సినిమా చూడాల్సిందేనని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి దర్శకత్వం: సుధీర్ వర్మ, నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్,
సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, స్టీవెన్ నామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు శంకర్ డొంకాడ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్, ఎడిటర్: విప్లవ్ నైషధం, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్: అక్షరు పూల్లా, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్.