Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'.
శ్రీ సింహ కోడూరి హీరోగా డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కు తున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు తెలిపారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయ నున్నట్లు నిర్మాతలు అధి కారికంగా ప్రకటించారు.
ఎనౌన్స్మెంట్ పోస్టర్లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని భిన్న హావభావాలతో కనిపిస్తూ ఆసక్తికరంగా ఉంది. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
'సింహ కోడూరి గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్, పాత్ర తీరు తెన్నులు సైతం చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈయన పాత్రకు దీటుగా సముద్రఖని పాత్ర ఉండబోతోందని రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఓ దొంగ జీవితంలో ఏం జరిగింది అనే ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ త్రిపుర అత్యద్భుతంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, అత్యున్నత సాంకేతిక బందం పని చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, చిత్రా సుబ్రమణ్యం, వంశీ బండారు, లైన్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ డి.