Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెడుతోంది.ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా 'ఒకటే కదా' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్‌మేట్ సెర్చింగ్ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోరు ఈ పాట కోసం యూత్ ఫుల్, ట్రెండీ ట్యూన్‌ని కంపోజ్ చేయగా, పాటకు కష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్‌గా పాడిన విధానం కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు, 'ఒకటే కదా' పాట బ్రిలియంట్ కంపోజిషన్, ఆకట్టుకునే సాహిత్యం, వాయిస్‌తో అలరిస్తోంది.సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా, సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ప్రైజ్ ప్రకటనలను మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ ఎందుకు పెట్టారనే విషయాన్ని మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. శర్వానంద్, అమల అక్కినేని, రీతూవర్మ పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. ముఖ్యంగా తల్లీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆద్యంతం భావోద్వేగ భరితంగా ఉంటాయి. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా శర్వానంద్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ పాత్రతో అభిమానులనే కాకుండా ప్రేక్షకుల్ని సైతం ఆయన మెస్మరైజ్ చేయబోతున్నారు.ఈ సినిమాతో ఆయనకు మరింత మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు ఆయన కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగానూ నిలిచిపోవడం ఖాయం. కథానుగుణంగా దర్శకుడు, నటుడు, రచయిత తరుణ్ భాస్కర్ రాసిన సంభాషణలు అందర్నీ కచ్చితంగా అలరిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీ కార్తీక్, నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, డీవోపీ: సుజిత్ సారంగ్, సంగీతం: జేక్స్ బిజోరు, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ డైరెక్టర్: ఎన్.సతీష్ కుమార్, స్టంట్స్: సుదేష్ కుమార్, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కష్ణకాంత్.