Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న చిత్రం 'ఎన్త్ అవర్'. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు యస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎ.ఎం.రత్నం ఈ చిత్ర పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజు గుడిగుంట్ల మాట్లాడుతూ, 'దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్‌గా ఉందో, కథ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో మాకు మంచి నటీనటులు, టెక్నీషియన్లు లభించారు. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మంచి అడ్వంచర్ కథతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని అన్నారు.
'కథలో జరిగే సంఘటనలు అనూహ్యంగా ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియకుండా జరుగుతున్నందున ఈ చిత్రానికి 'ఎన్త్ అవర్' అనే టైటిల్ పెట్టడం జరిగింది.వినూత్నమైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ కథగా వస్తున్న ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన విశ్వ కార్తికేయకు జంటగా బాలీవుడ్ నటి రిషికా కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్ ప్యాకేజ్డ్ గా ఉంటుంది' అని దర్శకుడు ఆనంద్ కొలగానీ చెప్పారు.