Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం 1గా రూపొందుతున్న చిత్రం 'సామాన్యుడి ధైర్యం'. సిహెచ్ నరేష్ హీరోగా, రామ్ బొత్స దర్శకత్వంలో రమణ కొఠారు ఓ కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభత్సోవం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ నివ్వగా, పాత్రికేయులు వినాయకరావు, నిర్మాత టి.రామ సత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రమణ కొటారి మాట్లాడుతూ, 'దర్శకుడు చెప్పిన కథ నచ్చి తొలిసారిగా సినిమా రంగంలోకి వస్తూ ఈ చిత్రం నిర్మిస్తునాను. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను' అని తెలిపారు. 'సామాన్యుడి ధైర్యం ఎలా ఉంటుందో మా సినిమాలో చూపించబోతున్నాం. కొత్త, పాత నటీనటులతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో యాక్షన్, హాస్యం, సామాజిక అంశాలుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత రమణ కొటారిగారికి కృతజ్ఞతలు' అని దర్శకుడు రామ్ బొత్స తెలిపారు.