Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేఖ ప్రొడక్షన్స్ పతాకంపై అగస్త్య, నక్షత్ర జంటగా సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నానాజీ మిరియాల దర్శకత్వంలో నిర్మాత నందిగం వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'బాపట్ల ఎంపీ నందిగం సురేష్'. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన తొలి షాట్‌కు ఎం.పి.నందిగం సురేష్ క్లాప్ నివ్వగా, నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచాన్ చేశారు.
నిర్మాత నందిగం వెంకట్ మాట్లాడుతూ, 'చిన్నప్పటి నుండి తమ్ముడు సురేష్ నాతో చేసిన జర్నీ. తరువాత యూత్ ప్రెసిడెంట్‌గా ఎదిగిన వైనం. కొన్ని దుష్ట శక్తులు అణిచివేయడం, ఓ సంఘటనలో తమ్ముడిని ఇరికించాలని చూడటం, జగన్ మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో సపోర్ట్ ఇవ్వడంతో ఎలా ఎం. పి అయ్యాడు అనేదే ఈ చిత్ర కథాంశం' అని అన్నారు. 'ఇది బాపట్ల ఎం.పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కోసుకుని బతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ, నమ్మిన సిద్ధాంతాలతో ఎలా ఎంపి అయ్యాడు అనేదే ఈ సినిమా కథ. ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా' అని దర్శకుడు తెలిపారు.