Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా 'యథా రాజా తధా ప్రజా' సినిమా పూజా కార్యక్రమాలతో పార్రంభం అయ్యింది. ఇందులో 'సినిమా బండి' ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు.హొ
ముహూర్తపు షాట్‌కి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకులు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.హొదర్శక, నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ, 'దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. జానీగారికి నేను 20 నిమిషాల్లో కథ చెప్పగా, కీలక అంశం నచ్చి ఓకే చేశారు. రాజకీయ వార్తలు అంటే గతంలో పది నిముషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశం అయ్యింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో సందేశంతో పాటి వాణిజ్య హంగులు అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేసి, మూడు షెడ్యూళ్లలోహొసినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రథన్ అద్భుతమైన బాణీలు అందించారు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వస్తుంది' అని చెప్పారు.