Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో వచ్చిన 'నాంది' చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ పొందింది. తాజాగా వీరిద్దరి కలయికలో రెండో సినిమా రూపొందనుందని మేకర్స్ ప్రకటించినట్లుగానే, సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను అందజేశారు. అలాగే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండే ఈ చిత్రానికి 'ఉగ్రం' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.
'కష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్' వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కథ: తూము వెంకట్, డైలాగ్స్: అబ్బూరి రవి, డీవోపీ: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి.