Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం 'ఆకాశ వీధుల్లో'. గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మనోజ్ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనోజ్ మాట్లాడుతూ, 'సెప్టెంటర్ 2న మా సినిమా విడుదల కాబోతుంది. అందరూ ఆదరించండి. మా అబ్బాయి హీరోగా అద్భుతంగా చేశాడు' అని తెలిపారు.
కథా రచయిత, హీరో, దర్శకుడు గౌతమ్ కష్ణ మాట్లాడుతూ, 'ఎం.బి.బి.ఎస్.పూర్తిచేసి సినిమాపై తపనతో ఈ సినిమా తీశాను. ఈ సినిమాను ఎందుకు చూడాలనే వారికి చెప్పేది ఒక్కటే. ఈ సినిమా ఒక హీరో మీదనో, లేక క్యారెక్టర్ మీదనో తీసింది కాదు. యంగ్‌స్టర్స్ అందరి కథ. ఎదిగిన తర్వాత వయస్సు వచ్చిన వారికి చెందిన కథ కూడా. మనలో మనకు జరిగే సంఘర్షణ ఇందులో చక్కగా చూపించాం. ఇది అన్ని వయస్సులవారికి నచ్చే సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుందని చెప్పగలను. కథాపరంగా చెప్పాలంటే ఓ సామాన్యుడు రాక్‌స్టార్ ఎలా అయ్యాడు?, అతని జీవితంలో ప్రేమ పాత్ర ఎంతవరకు ఉంది అనేదే ఈ సినిమా. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. మాతోపాటు 40 మంది కొత్త వాళ్ళం మీముందుకు వస్తున్నాం. కుటుంబంలోని పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది పెద్దలు గ్రహించేట్లుగా చూపించాం. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా ఇది' అని చెప్పారు.