Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలో చిత్ర ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు బి.గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్లు అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్‌గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి' అని అన్నారు.
'ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2న థియేటర్‌కు వచ్చి, సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని ప్రముఖ దర్శకుడు సాగర్ తెలిపారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,'ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రియలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు.ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు.ఫొటోగ్రఫీ చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.
'సినిమా చూశాను. చాలా బాగుంది. దర్శకుడు వెంకట్ కథను చాలా బాగా నేరెట్ చేశాడు. నిర్మాత నాగేశ్వరావుకు సినిమానే ఊపిరి. తనకు హెల్త్ బాగాలేక లేకపోయినా సినిమా కోసం తను పడే తపన నాకెంతో నచ్చింది. ఇలాంటి నిర్మాతలు ఇండిస్టీకి రావడం ద్వారా అనేక మంది నటీనటులు, టెక్నీషియన్లు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతారు' అని యం.ఆర్.సి.వడ్లపాటి చౌదరి అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ, 'నాకు ఆరోగ్యం బాగా లేదని తెలుసుకుని, నాకు సపోర్ట్‌గా నిలిచారు యం.ఆర్.సి.వడ్లపాటి చౌదరిగారు. వారికి ధన్యవాదాలు. దర్శకుడు వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయటానికి ముందుకు వచ్చాను. సంగీత దర్శకుడు సందీప్ ఇందులో ప్రతి సాంగ్ చాలా బాగుండేలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. 'హుషారు' ఫేమ్ తేజ్ కూరపాటి, హీరోయిన్ అఖిల ఆకర్షణతో పాటు ఇతర నటీనటులు చాలా చక్కగా నటించారు. అలాగే టెక్నీషియన్లు అందరూ చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది' అని తెలిపారు. 'ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేశాం. అనుకున్న టైమ్‌కు, అనుకున్న బడ్జెట్లో తీశాం. మా దర్శకుడు వెంకట్ ఈ కథను చాలా బాగా తెరకెక్కించాడు' అని నిర్మాత ముల్లేటి కమలాక్షి అన్నారు. 'ఇదొక అందమైన రియలిస్టిక్ ప్రేమ కథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాం' అని దర్శకుడు వెంకట్ వందెల తెలిపారు.