Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో గత 23 రోజులుగా నిలిచిపోయిన షూటింగ్స్ ఇక మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ని యధావిధిగా నిర్వహించుకోవచ్చని, ఈలోపు అత్యవసరంగా ఎవరైనా షూటింగ్స్ చేయాలనుకుంటే, ఫిలిం ఛాంబర్ అనుమతి తీసుకుని చేసుకోవచ్చని నిర్మాత దిల్ రాజు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ' దిల్ రాజు ఆధ్వర్యంలో గత 23 రోజులుగా నిర్మాతలందరూ కూర్చుని, అన్ని శాఖలతో చర్చలు జరిపాం. ఇంకా కొన్ని సమస్యలపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ సమస్యలు కూడా త్వరలో క్లియర్ అవుతాయి. సెప్టెంబర్ 1నుంచి షూటింగ్లు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఎమర్జెన్సీగా చేసుకోవాలి అనుకుంటే ఛాంబర్ అనుమతితో చేసుకోవచ్చు. ఫిలిం ఛాంబర్ నిర్ణయమే ఫైనల్' అని తెలిపారు.
'ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య పరిష్కారమైంది. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. పెద్ద సినిమాలకు ఒక శ్లాబ్ ప్రకారం టికెట్ ధరలుంటాయి. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిబిటర్లకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తుంది. మూవీ ఆర్టిస్టుల మేనేజర్లతో సమావేశం జరిగింది. అన్ని సమస్యలకు సంబంధించి పరిష్కారాలపై ఆగస్టు 30న మా తుది నిర్ణయాలు వెల్లడిస్తాం' అని నిర్మాత దిల్రాజు అన్నారు.