Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ నటీనటులుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్న చిత్రం 'డై హార్డ్ ఫ్యాన్'.
ఈ సినిమా సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకులు సుకుమార్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సస్పెన్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుతున్నాను' అని అన్నారు.
'చాలా మంది ఈ టైటిల్ క్రేజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్‌కి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్రలు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. ఈ సినిమా కథలో మలుపులు ప్రేక్షకుడ్ని థ్రిల్ చేస్తాయి' అని దర్శకుడు అభిరామ్ తెలిపారు.
నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ, 'ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా నిర్మించాను. దర్శకుడు అభిరామ్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి మాట్లాడుతూ,' టీమ్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది' అని అన్నారు.