Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'కష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఓ తల్లిగా కనెక్ట్ అయ్యాను
మా అబ్బాయి నాగశౌర్య కథ విని, చాలా బాగుందని చెప్పాడు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైమెంట్ అండ్ ఫ్యామిలీ మూవీ కూడా. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్వేర్.. ఇలా ఈ కథలోని అన్ని ఎలిమెంట్స్‌కి మేం బాగా కనెక్ట్ అయ్యాం. అయితే 'అంటే సుందరానికీ' కూడా ఇదే బ్రాహ్మిణ్ క్యారెక్టరైజేషన్‌తో వచ్చింది. దానితో పోలిస్తే దీనికి ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు అనీష్ ఆ సినిమా చూశారు. ఎక్కడా పోలిక లేదు.
భిన్న కోణాల్లో నాగశౌర్య పాత్ర
ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిణ్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్లో ఈ సినిమా ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. బ్రాహ్మిణ్ పాత్ర కోసం శౌర్య రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. దీని కోసం దర్శకుడు ఒక ట్రైనర్‌ని కూడా ఏర్పాటు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నార. మొదట అనుకున్న విడుదల తేది పాండమిక్ కారణంగా అన్నీ సినిమాల్లానే ముందువెనుక అయ్యింది. అయితే మంచి సినిమా.. మంచి డేట్ చూసి రావాలని భావించాం. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. అందుకే సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.
200 మంది డాన్సర్స్‌తో పాట
200 మంది డాన్సర్స్‌తో చేసిన 'ఏముందిరా..' పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి గ్రాండ్ సాంగ్ ఉంటే బావుంటుందని అనుకున్నారు. మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. విజరు మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా అంతే అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. ఇప్పటికే ఆ పాటకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. శౌర్య ఫ్యామిలీ మూవీస్ చేసినప్పుడల్లా మంచి విజయాలు వచ్చాయి. అలాగని ఈ చిత్రాన్ని సేఫ్ గేమ్ అనుకోలేదండీ. నిజం చెప్పాలంటే కమర్షియల్ మూవీ కంటే దీనికి ఎక్కువ బడ్జెట్ అయ్యింది. టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం వుంది.