Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలుపోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'జాతి రత్నాలు' తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. 'ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. గురువారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. టీజర్‌తో ఇప్పటికే ప్లాట్లైన్ను రివీల్ చేయగా, ట్రైలర్ మరిన్ని విజువల్స్, కంటెంట్‌ను ఆసక్తిగా ప్రజెంట్ చేేసింది. హీరోకి తన గర్ల్ ఫ్రెండ్‌ని మెప్పించే అవకాశం వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుతుంది హీరో గర్ల్ ఫ్రెండ్. టిక్కెట్ల కోసం అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమైన హీరో, చివరి ప్రయత్నంగా నేరుగా థియేటర్ వద్దకు వెళ్తాడు. అక్కడ భారీగా ప్రేక్షకుల, అభిమానుల జాతరని చూస్తాడు. హీరో తన ప్రేయసితో కలిసి 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఇందులో కథాంశం ట్రైలర్ ఆద్యంతం నవ్వించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వెన్నెల కిషోర్ పాత్ర సినిమాలో అలరించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. తనికెళ్ల భరణి హీరో తండ్రి పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషుల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగవ్వ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. దర్శకుడు వంశీధర్ పాత్ర నవ్వులు పూయించింది. ట్రైలర్లో చివరి సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. రధన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కామెడీని మరింత ఎలివేట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.