Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథా చిత్రం 'గీత'. వి.వి.వినాయక్ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.'మ్యూట్ విట్నెస్' అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకుని, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, 'ఈ సినిమా అవకాశాన్ని నా గురువు వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమా విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజరులకు ప్రత్యేక కత్ఞతలు' అని అన్నారు.
'గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాత ఆర్.రాచయ్య చెప్పారు. హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ 'గీత' వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ.