Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఈ కథ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఖుషి' సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టికెట్లు సాధించడానికి శ్రీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. 'జాతిరత్నాలు' సినిమాలో మాదిరిగానే ఇందులోనూ ప్రతి సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. ఈ కథలోని సోల్‌ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. వంశీ, లక్ష్మీనారాయణ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే వుంటాం. కానీ హీరో, హీరోయిన్ సీన్స్ వచ్చినపుడు మాత్రం కాస్త ఆగుతాం. చాలా మంచి లవ్ ట్రాక్. తనికెళ్ళ భరణిగారిలాంటి పెద్ద నటుడితో కలిసి పని చేయడం నా అదష్టం. అలాగే వెన్నెల కిషోర్ గారిది ఇందులో చిన్న పాత్రే అయినా కీలకమైన పాత్ర. అనుదీప్‌ని గాడ్ ఫాదర్ అనడం కంటే మంచి స్నేహితుడు, బ్రదర్ అని భావిస్తా. ఆయన కథలు నాతో పంచుకుంటారు. రధన్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు. సినిమా చూసిన తర్వాత నిర్మాతలు శ్రీజ, శ్రీరామ్ గారు అద్భుతంగా చేశావని చెప్పారు. పూర్ణోదయ బ్యానర్లో నేనూ ఒక భాగం అవ్వడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇకపై కూడా నాకు అన్ని కథలు చేయాలని ఉంది. అయితే కామెడీ, లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం' అని హీరో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.