Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమాను సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కథానాయిక కేతిక శర్మ సోమవారం మీడియాతో సంభాషించారు. 'రొమాంటిక్', 'లక్ష్య' చిత్రాల తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆ రెండు సినిమాల్లోని పాత్రలతో పోలిస్తే, ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు రాధ. చాలా నిజాయితీగా ఉంటాను. చేసే ప్రతి పనిని ఎంతో సిన్సియర్‌గా చేస్తాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అది ఎంత కీలకంగా ఉంటుంది అనేది మాత్రం మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే బాగుంటుంది (నవ్వుతూ). ఈ సినిమా ద్వారా వైష్ణవ్తేజ్లాంటి మంచి స్నేహితుడు దొరికాడు. ఈ సినిమాలో మా ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని అందరూ చెప్పారు. మా ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. దర్శకుడు గిరీశాయా ఈ చిత్రకథను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఆయనకు కథ మీద, అలాగే నటీనటుల దగ్గర్నుంచి ఎలాంటి అవుట్‌ఫుట్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. మా నిర్మాతలు బాపినీడు, ప్రసాద్‌గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్, తులసి, ప్రభు, నవీన్చంద్రలాంటి హేమాహేమీలు నటించారు. వీరిందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులోని పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసే సినిమా ఇది. ప్రతి సినిమాకి నా ఎఫెర్ట్ ఒకేలా ఉంటుంది. జయాపజయాలను గురించి అస్సలు పట్టించుకోను. పని చేయటమే నాకు తెలుసు. 'రొమాంటిక్', 'లక్ష్య' రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే ఈ సినిమా మాత్రం కచ్చితంగా నాకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను' అని కేతికా శర్మ అన్నారు.