Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో కథానాయిక సంచిత బషు మీడియాతో ముచ్చటించారు.
'మాది బీహార్. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. టిక్‌టాక్‌లో నేను చేసిన వీడియోలు మంచి జనాదరణ పొందాయి. సోషల్ మీడియా వేదికలుగా చేసిన రీల్స్‌కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. నా వీడియోలు చూసి దర్శకుడు అనుదీప్ గారు ఆడిషన్స్‌కి పిలిచారు. అలాగే లుక్‌టెస్ట్ చేసి, నన్ను ఎంపిక చేశారు. దర్శకులు వంశీ, లక్ష్మీ నారాయణ ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నన్ను చాలా ప్రోత్సహించారు. అలాగే నిర్మాత శ్రీజ గారు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఎన్నో విలువలైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ చిత్రంలో లయ అనే పాత్రలో కనిపిస్తా. 2000 కాలం అమ్మాయిని. లయ పాత్రలో సిగ్గు, అమాయకత్వం ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని. 'ఖుషి' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని తన బారు ఫ్రెండ్‌ని కోరుతుంది. ఆ టికెట్లు సంపాదించడం చుట్టూ ఈ కథ ఉంటుంది. అనుదీప్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయం. ఆయన చేసిన 'జాతిరత్నాలు' చూశాను. అలాగే పూర్ణోదయ క్రియేషన్స్ ప్రతిష్టాత్మక సంస్థ. వారి నిర్మాణంలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాలో భాగం అవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?, ఇదొక హిలేరియస్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. ఇప్పటివరకు నన్ను నేను టిక్‌టాక్ వీడియోల్లో మాత్రమే చూశాను. ఫస్ట్‌టైమ్ బిగ్‌స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. నాకంటే మా అమ్మ ఎక్కువ సంతోష పడింది. ఓ నటిగా ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రలన్నింటినీ చేయాలని ఉంది' అని సంచిత బషు తెలిపింది.