Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విక్రమ్ హీరోగా, ఆర్ అజరు జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ని చిత్ర బృందం గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ,'మీ అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఎనర్జీని చూసి చాలా రోజులైంది. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులందరికీ కతజ్ఞతలు. 'కోబ్రా'ని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు లాంటి మంచి నిర్మాత విడుదల చేయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఏవీ చూసినప్పుడు ఇన్ని పాత్రలు నేనే చేశానా? అని నాకే ఆశ్చర్యమేసింది. మనందరికీ సినిమా అంటే ప్రేమ. నాకు నటన మీద ఎంతపిచ్చో, మీకు సినిమా మీద అంత పిచ్చి. మీ అందరి ప్రేమకి కతజ్ఞతలు. నా సినిమా థియేటర్లోకి వచ్చి మూడేళ్ళు అయ్యింది. ఈ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కోబ్రా విజువల్ ట్రీట్. అపరిచితుడు' లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్.. అన్నీ అంతకుమించి ఉంటాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ శ్రీనిధి, మీనాక్షి, మణాళిని. ముగ్గురు పాత్రలు బావుంటాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు. 'విక్రమ్ గారు సెన్సేషనల్ హీరో. విక్రమ్, దర్శకుడు అజరు జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. ఈ సినిమా కోసం రష్యాలో మైనస్ డిగ్రీల వద్ద కూడా చిత్రీకరణ జరిపి, ఒక ఫీస్ట్ లాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈనెల 31 వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా థియేటర్లోకి వస్తోంది. ప్రేక్షకుల ఆశీర్వాదం ఈ చిత్రానికి ఉండాలి' అని ఎన్వీఆర్ ప్రసాద్ అన్నారు.