Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరికొత్త గెటప్‌లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం 'మార్క్ ఆంటోని'. మినీ స్టూడియోస్ పతాకంపై రీతూవర్మ, సునీల్ వర్మ , అభినయ, వైజీ మహేంద్రన్, నిజగల్ రవి, కింగ్స్లీ నటీ నటులుగా నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
''మార్క్ ఆంటోని' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్‌లో పవర్ ఫుల్ పాత్రలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు, కథలతో ప్రేక్షకులను, తన అభిమానులను మెప్పించేందుకు విశాల్ ప్రయత్నిస్తారనే సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమాతోనూ ఆయన మరోమారు వైవిధ్యంగా కనిపించేందుకు రెడీ అయ్యారనే విషయం ఫస్ట్‌లుక్ పోస్టర్ చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో ఆయన పాత్ర లుక్ ఎందుకు అలా ఉంది?, ఆయన లక్ష్యం ఏమిటి?, 'మార్క్ ఆంటోని'గా ఆయన ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నల పరంపరకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి రచయిత- దర్శకుడు : అధిక్ రవిచంద్రన్, సంగీతం : జివి ప్రకాష్ కుమార్, డి ఓ పి : అభినందన్ రామానుజం, ఆర్ట్ డైరెక్టర్ : ఆర్ విజరు మురుగన్, ఎడిటర్ : విజరు వేలుకుట్టి, యాక్షన్ డైరెక్టర్స్ : దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ, కొరియోగ్రాఫర్లు : దినేష్, బాబా బాస్కర్, అజహర్, గీత రచయితలు : మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్.