Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్, జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ పై తేజ్ కూరపాటి హీరోగా, అఖిల ఆకర్షణ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా'.
వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ, 'అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి' అని అన్నారు.
'సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2న థియేటర్‌కు వచ్చి, సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని మరో సీనియర్ దర్శకుడు సాగర్ చెప్పారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్, నందమూరి హరికష్ణ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయటం విశేషం' అని తెలిపారు. 'గణేష్ మాస్టర్ ఇందులో యాక్టింగ్‌తో పాటు ఐదు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సందీప్ ఇచ్చిన పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు అన్నారు.
చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ, 'ఒక సినిమా చేయడం ఎంత కష్టమో ఈ ఒక్క సినిమాతో నాకు తెలిసింది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని తెలిపారు. 'మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. సందీప్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఇందులో హీరో, హీరోయిన్స్ మన పక్కింటి అమ్మాయి, అబ్బాయిలా చాలా చక్కగా నటించారు' అని చిత్ర దర్శకుడు వెంకట్ వందెల చెప్పారు.