Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది?, ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు?, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే 'నేచర్' చిత్ర కథాంశం.
శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ పతాకంపై కష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి.యశోదమ్మ,, టి.చేతన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తలకోన, తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్బంగా ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రంలోని 'నిన్నే చూడందే' లిరికల్ సాంగ్‌ను ముఖ్య అతిథిగా వచ్చిన హాస్యనటుడు అలీ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''నేచర్' సినిమా టైటిల్ బాగుంది. నేచర్ బాగుంటే మనందరం బాగుంటాము. రిలీజ్ చేసిన ఈ పాట చూస్తుంటే నాకు ఇళయరాజా పాటలు గుర్తుకువస్తున్నాయి. యం.యల్ రాజా అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ కూడా సాంగ్‌లో చాలా బాగా నటించారు. కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది' అని అన్నారు.
'ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇద్దరు టీచర్స్ రాసిన కథే ఈ ''నేచర్' అని దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తెలిపారు. దర్శకుడు అశ్విన్ కామరాజు కొప్పల మాట్లాడుతూ,'మీరు చూసిన ప్రతి సీన్ ప్రతి షాట్ సినిమాలో ఇలానే ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. కథని, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని చెప్పారు.