Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీకృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'.
శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్లో నటించిన సోను ఠాగూర్ మీడియాతో ముచ్చటించింది.
'మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే 'జోరుగా హుషారుగా' సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో చేసిన పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకష్ణ గారి బ్యానర్లో, ఆయన కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో హీరో కిరణ్‌తో యాక్ట్ చేయాలనే ఆఫర్ రాగానే చాలా సంతోషం కలిగింది. మోడల్‌గా ఎక్స్పీరియన్స్ ఉండటం వలన సినిమాలో నటించడం చాలా ఈజీగా అయింది. ఇందులో డ్యాన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉండటంతో 'లాయర్ పాప..' సాంగ్ చేశాను. ఈ పాటకు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాకు రన్ టైమ్ తక్కువ ఉన్నా ఫుల్ ఫన్ ఉంటుంది. చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హీరో కిరణ్ చాలా కూల్ పర్సన్. తనతో కలిసి డ్యాన్స్ చేయడం హ్యాపీగా అనిపించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆయన మ్యూజిక్‌లో వస్తున్న 'లాయర్ పాప' పాటను చూసే ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డ్యాన్స్ వేసే విధంగా ఉంటుంది. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని సోను ఠాగూర్ అన్నారు.