Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ 'అల్లూరి'. నిజాయితీకి మారు పేరు అనేది ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మీడియాతో ఈనెల 3 నుండి అల్లూరి టీం యాత్రని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కి ఆయన పోలీస్ డ్రెస్‌లో రావడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''అల్లూరి' పేరు వింటేనే ఒక పవర్ వస్తుంది. అంతే పవర్ ఫుల్ స్టొరీ ఇది. ఎవరికైనా పోలీసు అవ్వాలని ఉంటుంది. నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని అనుకున్నాను. ఈ సినిమాని చాలా ఎమోషనల్‌గా, ఇష్టంగా చేశాను. ఈ సినిమాపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే మీముందుకు పోలీస్ డ్రెస్‌తో వచ్చాను. ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటి నుండి సినిమాకి సంబంధించిన పాటలు వరుసగా విడుదల చేసి, పదిరోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం. ఈనెల 3 నుండి వైజాగ్‌లో అల్లూరి సీతారామారాజు గారి సమాధి దగ్గర నుండి హీరో గారితో పాటు సినిమా యూనిట్ అంతా కలిసి యాత్రని ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో టూర్ చేసి, పోలీసు అధికారులకు సన్మానం చేస్తూ, పబ్లిక్‌తో కలుస్తూ 12 రోజుల పాటు టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్‌లో మొదలైన టూర్ వరంగల్ నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. టూర్ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని గ్రాండ్ విడుదల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే పవర్ఫుల్ కథతో 'అల్లూరి'లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతగా గర్వపడుతున్నాను' అని తెలిపారు.