Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. నిధి అగర్వాల్ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (శుక్రవారం) హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం మేకర్స్ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ ప్రచార చిత్రంలో, 'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం...' అన్నట్లుగా కథానాయకుడు కనిపిస్తున్నారు. నేడు (శుక్రవారం) సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లింప్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇదొక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ. భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా చెప్పని కథ. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలిపారు.