Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా రూపొందించిన పాట 'జరీ జరీ పంచె కట్టు..'. మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో మానస్ నాగులపల్లి, యాంకర్ విష్ణు ప్రియ నర్తించిన ఈ ఫోక్ సాంగ్‌ను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాకేత్ (సింగర్) మాట్లాడుతూ, 'సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఈ పాటను నేను పాడటం అదష్టంగా భావిస్తున్నా. ఈ ఆల్బమ్ సాంగ్స్ అన్నింటినీ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాతలను అభినందిస్తున్నాను' అని అన్నారు.
'సుద్దాల అశోక్ తేజ్ గారితో లిరిక్స్ రాయించుకుని, శేఖర్ మాస్టర్‌కు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా ఆయన కోరియోగ్రఫీలోనే ఈ పాట చేయాలని పట్టు బట్టి చేసిన నివ్రితి వైబ్స్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక యు ట్యూబ్ సాంగ్‌కు ఇంత ఖర్చు పెట్టి, చాలా గ్రాండ్‌గా తీశారు. ఈ పాటను చూసిన అందరూ ఇదొక మూవీ సాంగ్ అనుకునేలా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సుద్దాల గారు ఇచ్చిన లిరిక్స్ అందరూ హమ్ చేసేలా, చాలా ఈజీగా ఉన్నాయి.ఈ పాటకు సింగర్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేశారు. అలాగే టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయడం వలనే ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది' అని హీరో మానస్ తెలిపారు.
పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ, 'సుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈ పాట చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో మానస్, విష్ణు ప్రియ ఈ పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు' అని చెప్పారు. సన్నీ మాట్లాడుతూ, 'మానస్‌ను అందరూ హి విల్ బి స్టార్ అంటున్నారు.. బట్ నాకు తెలిసినంత వరకు మానస్ హి ఈజ్ ఎ స్టార్.. ఈ సాంగ్‌లో తను చేసిన డాన్స్ అదిరిపోయింది. మానస్, విష్ణు ప్రియ డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నా నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలి' అని తెలిపారు.