Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జె.ఆర్.పిక్చర్స్, మిధున ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నందిత శ్వేత, రామ్ జంటగా సూర్య తేజ్, డి.జె.టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'ఓటీపీ'. కళ్యాణ్ కుమార్ దర్శకత్వంలో యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ఇటీవల రాక్ క్యాస్టిల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధులుగా వచ్చిన హాస్యనటుడు అలీ స్క్రిప్ట్ అందించగా, ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీరామచంద్ర చిత్ర హీరో, హీరోయిన్‌పై చిట్రీకరించిన ముహూర్తపు షాట్‌కి క్లాప్ ఇవ్వగా, చిత్ర నిర్మాత కూతురు బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ, 'కళ్యాణ్‌గారు చెప్పిన కథ చాలా క్యూరియాసిటీగా, చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మంచి స్క్రిప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని అన్నారు. 'సైబర్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఈ సినిమాను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేసి, శివరాత్రికి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చిత్ర దర్శకుడు కళ్యాణ్ కుమార్ తెలిపారు.
నిర్మాత గురు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమాలో హీరోయిన్ నందిత శ్వేత కీ రోల్లో నటిస్తున్నారు.తనకు జోడీగా రామ్ మిట్టకంటి హీరోగా నటిస్తుండగా, సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ (విలన్ ) తదితరులతో పాటు మంచి టెక్నిషియకన్స్ దొరికారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మహా శివరాత్రికి మల్టీ లాంగ్వేజ్‌ల్లో విడుదల చేస్తాం' అని చెప్పారు.