Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగు పెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకుంది. శర్వాంద్ మాట్లాడుతూ,'ఇది మనసుని హత్తుకునే సినిమా. కార్తీక్ ఇందులో గొప్ప విషయం చెప్పాడు. నిన్నటి బాధ, రేపటి ఆశతో బ్రతుకుతుంటాం. కానీ ఈ క్షణాన్ని గుర్తించం. అది గుర్తించినపుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. అందుకే ఒకే ఒక జీవితం టైటిల్ పెట్టాం. మదర్ ఎమోషన్‌తో పాటు మంచి వినోదం ఇందులో ఉంది' అని తెలిపారు. అమల అక్కినేని మాట్లాడుతూ, 'ఇందులో శర్వానంద్‌కి తల్లిగా చేశాను. ఇది చాలా స్పెషల్ మూవీ. థియేటర్‌కి వెళ్లి చూడండి. మిమ్మల్ని కదిలిస్తుంది' అని అన్నారు. 'ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీకార్తిక్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. సినిమా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలా ఉంటుంది' అని రీతూ వర్మ చెప్పారు.
దర్శకుడు శ్రీకార్తిక్ మాట్లాడుతూ,' అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది అని తమిళంతోపాటు తెలుగులో కూడా చేద్దామని నాకు నిర్మాత ప్రభుగారు నమ్మకం ఇచ్చారు. ఈ సినిమా అమ్మ గురించిన సినిమా' అని తెలిపారు.
'దర్శకుడు ఈ కథ చెప్పినపుడు చాలా ఎంజారు చేశాం. అప్పుడే మాకు చాలా నమ్మకం వచ్చింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది' అని నిర్మాత ప్రభు తెలిపారు.