Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రావణ్ నిట్టూరు హీరో పరిచయం అవుతూ రూపొందుతున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'.
రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్. జె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
'రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. నిమిషం 30 సెకన్లు నిడివి గల ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. టీజర్లో కథా నేపథ్యాన్ని చాలా ఆసక్తికరంగా దర్శకుడు రివీల్ చేశారు. తిరుపతిలో ఫోటోల షాపు పెట్టుకోవాలని తపించే హీరో, అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బ్యాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై చాలా క్యూరీయాసిటీని పెంచాయి. రావణ్‌తో పాటు టీజర్లో కనిపించిన మిగతా నటీనటులంతా చక్కని అభినయం కనబరిచారు. టీజర్‌కి ఫణి కళ్యాణ్ అందించిన నేపథ్య సంగీతం బ్రిలియంట్‌గా ఉంది. డిజికె కెమెరా పనితనం డీసెంట్‌గా ఉంది. తిరుపతి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలై 'మా తిరుపతి' పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుసగా 12 రోజులు టాప్ ట్రెండింగ్‌లో ఉంటూ 30 లక్షలు పైన వ్యూస్‌ని సాధించి చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది' అని చిత్ర బృందం తెలిపింది.