Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'విశ్వక్'తో నటనలో తనదైన ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. తన రాబోయే 'అజయ్ గాడు' చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని, టైటిల్‌ని గురువారం యువ కథానాయకుడు సత్యదేవ్ ఆవిష్కరించి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
''అజయ్ గాడు' అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంది. అజయ్ కతుర్వార్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దష్టిని ఆకర్షించాడు. త్వరలోనే ఫైర్ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అజయ్ కతుర్వార్ దర్శకత్వం వహించారు. అలాగే చందనా కొప్పిశెట్టి సహకారంతో అజరు కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన స్వయంగా నిర్మించారు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. 'ఓ సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. అలాగే ఇందులో అజయ్ కతుర్వార్ నటన అందర్నీ మెప్పిస్తుంది. అలాగే సినిమాగ్రఫీ, సంగీతం.. ఇలా ఏ అంశం తీసుకున్నా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి' అని చిత్ర బృందం తెలిపింది. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం సమకూరుస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని, ఫైట్స్‌ని పృధ్వీ అందిస్తున్నారు. 'రాగల 24 గంటల్లో, అలాంటి సిత్రాలుతోపాటు అనేక ఇతర చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో కనిపించిన పృధ్వీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.