Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిరంజీవి తొలిసారి ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
గురువారం ఈ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. నయనతార కాటన్ లినెన్ చెకర్డ్ చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. టైప్‌రైటర్‌లో లెటర్ని రెడీ చేస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు నయనతార. త్వరలోనే చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేయనున్నారు.
పూరి జగన్నాథ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
'దసరా బరిలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 'గాడ్‌ఫాదర్'గా చిరు నటన టెర్రిఫిక్‌గా ఉండబోతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్‌ల పాత్రలు సైతం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి. చిరు అభిమానులి, అలాగే ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా, నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, సంగీతం: ఎస్ ఎస్ తమన్, డీవోపీ: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు.