Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. కోడి రామకష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు పవన్‌కళ్యాణ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్థమవుతుంది. కిరణ్ మాస్ లుక్‌లో, క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి. కష్ణారెడ్డి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ సైతం ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఓ మంచి కాన్సెప్ట్‌తో సకల హంగులతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కిరణ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలువనుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓ మంచి సినిమాని నిర్మించినందుకు గర్వంగానూ ఫీల్ అవుతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.