Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా టైటిల్స్ క్లాష్ అవ్వడమనేది చాలా అరుదు. ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తున్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. తాజాగా 'టాప్ గేర్' సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇప్పటికే ఆది సాయి కుమార్ హీరోగా 'టాప్ గేర్' అనే టైటిల్‌తో ఓ సినిమాను ఎనౌన్స్ చేసి, టైటిల్ లోగో కూడా రివీల్ చేశారు నిర్మాత కె.వి.శ్రీధర్ రెడ్డి. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే, ఇదే 'టాప్ గేర్' టైటిల్ పెట్టి మలయాళ హీరోతో మరో సినిమా రానుందని, ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోందని, ఈ మలయాళ సినిమాను తెలుగులోనూ ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో ఇది తమ సినిమా టైటిల్ అని, ఈ 'టాప్ గేర్' టైటిల్ హక్కులన్నీ తమ వద్ద ఉన్నాయని నిర్మాత శ్రీధర్ రెడ్డి చెప్పారు. తమ సినిమా చిత్రీకరణ చేస్తున్న ఈ సమయంలోనే ఓ మలయాళం సినిమాను అదే పేరుతో రూపొందిస్తూ, ఇక్కడ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సదరు నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 'టాప్ గేర్' సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని, 'టాప్ గేర్' పేరుతో తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తమ సినిమాను చకచకా కంప్లీట్ చేస్తున్నామన్నారు. తమ 'టాప్ గేర్' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని, రీసెంట్గా తమ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో వేలాది మంది స్టూడెంట్స్ నడుమ ఘనంగా నిర్వహించామని ఆయన చెప్పారు. ఆదిత్య మూవీస్ అండ్ ంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నామని, హీరో ఆది సాయికుమార్ నటన ఆద్యంతం అలరిస్తుందని నిర్మాత శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రామాంజనేయులు, కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.