Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య నటిస్తున్న డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కష్ణ వ్రింద విహారి'. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా శనివారం విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ వినోదం, గ్లామర్, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాలతో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
కష్ణ (నాగశౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, సిటీకి వస్తాడు. అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రిందని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి కష్ణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. కష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్ గర్ల్. ఇది కాకుండా వీరి పెళ్లికి మరో సమస్య ఉందని ట్రైలర్ చూస్తూనే అర్థమవుతోంది. ఇందులో నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్, కామిక్ టైమింగ్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో సాంప్రదాయకంగా కనిపిస్తూనే,.. ఫార్మల్స్, ఫ్యాషన్ కాస్ట్యూమ్స్‌లో సూపర్ కూల్, ట్రెండీగా ఉన్నాడు. షిర్లీ సెటియా గ్లామరస్‌గా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రాధికా శరత్ కుమార్ తల్లిగా కనిపించింది. వెన్నెల కిషోర్ కోమాలో ఉన్నప్పటికీ తన ప్రెజెన్స్‌ని చాటుకున్నాడు. బ్రహ్మాజీ కెఎఫ్సి సీక్వెన్స్ హిలేరియస్‌గా ఉంది. రాహుల్ రామకష్ణ, సత్య కూడా వినోదాన్ని పంచారు. దర్శకుడు అనీష్ ఆర్ కష్ణ కామెడీని బాగా హ్యాండిల్ చేయగలడు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకర్షించే ఎలిమెంట్స్ ఉన్నాయని వేరే చెప్పక్కర్లేదు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.