Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, ప్రజా సేవకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న కృష్ణరరాజు మృతిపట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మంత్రి కేటీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వెండితెర రారాజు ఇకలేరని ఆయనతో ఉన్న తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు సినీ ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు.
50 సంవత్సరాల స్నేహం మాది. కృష్ణంరాజు హీరోగా సక్సెస్ అయ్యాక కూడా 'ఇంద్రభవనం', 'యుద్ధం', 'అడవి సింహాలు' వంటి సినిమాల్లో కలిసి నటించాం. - కృష్ణ
మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్‌కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. - చిరంజీవి
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. - బాలకృష్ణ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో, కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. - పవన్‌కళ్యాణ్
కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు ఇది. ఆయన జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. - మహేష్‌బాబు
ఒక మంచి స్నేహితుడిని కోల్పోయా.. - జయసుథ
కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండిస్టీకి తీరని లోటు. అద్భుతమైన ఒక లెజెండ్‌ను కోల్పోవడం టాలీవుడ్‌కు తీరని లోటు. - అల్లు అర్జున్
ప్రేక్షకులు, అభిమానుల సందర్శానార్థం కృష్ణంరాజు భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఫిల్మ్‌చాంబర్‌కి తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడ్నుంచి మెయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో లో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేయనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.