Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో డైరెక్టర్ శ్యామ్ మండల 'అం అః' చిత్రంతో ప్రయోగం చేస్తున్నారు. సుధాకర్ జంగం, లావణ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్' అనేది ట్యాగ్‌లైన్. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ కంగుల సంగీతం అందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా ఈ మూవీ పోస్టర్, 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ హ్యుజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సస్పెన్స్‌తోపాటు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: అవినాష్ ఎ.జగ్తప్, లైన్ ప్రొడ్యూసర్: పళని స్వామి, సినిమాటోగ్రఫీ : శివారెడ్డి సావనం.