Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది.
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ సినిమా షూటింగ్లో కలుసుకోవడం
విశేషం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా షూటింగ్ లొకేషన్లో హీరో మహేష్ బాబుతో త్రివిక్రమ్ సన్నివేశం కోసం చర్చిస్తున్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తమ అభిమాన క్రేజీ కాంబినేషన్లో సినిమా మొదలైందని అటు మహేష్‌బాబు, ఇటు త్రివిక్రమ్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సినిమా 28 ఏప్రిల్, 2023 వేసవిలో చిత్రం విడుదల కానుంది. అయితే మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం, చిత్ర విడుదల తేదీ కూడా 28 వ తేదీ కావడాన్ని చిత్ర బృందం ఓ ప్రత్యేకతగా భావిస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే మరోసారి జతకడు తుండగా, జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయా గ్రాహకుడుగా పి.ఎస్.వినోద్, తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు.